దయచేసి వినండి…!!! ట్రైన్ నెం: రెండు-సున్నా-సున్నా- ఒకటి- కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ..దేశం మొత్తం తిరగాల్సిన బడ్జెట్ రైలు..మరికొన్ని
గంటల్లో పార్లమెంట్ ఫ్లాట్ ఫారం మీదకు రాబోతోంది డిపార్ట్‌మెంటల్ అనౌన్స్‌మెంట్..!వాయువేగంతో దూసుకొస్తున్న ఈ మమత ఎక్స్‌ప్రెస్..కొన్ని రాష్ట్రాల్లో
ఆగక పోవచ్చు..!!! అందులో ఎప్పటి లాగే ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండొచ్చు…!!! ఎన్నికల వేళ బెంగాల్ ఓటర్ల వెంట పడ్డ దీ గ్రేట్ మమతా బెనర్జీ…బడ్జెట్
ఎక్స్‌ప్రెస్‌ను స్వరాష్ట్రం వైపు ఎప్పుడో దారి మళ్లించేశారు….
