Archive for April, 2010


ఎక్స్ క్లూజివ్…ఎక్స్ క్లూజివ్..ఎక్స క్లూజివ్..తెలుగు న్యూస్ ఛానల్స్ ను ఫాలో అయ్యే వారికి ఈ మధ్య
ఈ పదం ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది. తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు పోటీ అంతా
ఎక్స క్లూజివ్ గా నడుస్తోంది. Continue reading

1500 కోట్లకు పైగా సంవత్సర టర్నోవర్‌

ప్రతి ఏటా 15 % పైగా టార్గెట్స్‌

అవసరమైన చోట భారీ పెట్టుబడులు

వద్దనుకుంటే ఉపసంహరణలు

జీతాల చెల్లింపు…ప్రతిభకు తగ్గ సత్కారాలు

ఇవన్నీ వింటుంటే దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్‌ కంపెనీ ఆదాయవ్యయాల లెక్కల్లాగా అనిపిస్తున్నాయి కదా…కానీ కార్పోరేట్‌ ప్రపంచానికి తీసిపోని స్థాయిలో మనీ సామ్రాజ్యం నడుస్తోంది. అదే మావోయిస్టుల మనీ సామ్రాజ్యం.  Continue reading

ఇంట్లో ఓ కంప్యూటర్‌…దానికో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షనూ…క్లిక్‌ చేస్తే చాలు వాయువేగంతో దూసుకువచ్చే సమాచారం…అన్నీ కంటి ముందే ఇంటిలోనే… అన్నీ అందుబాటులోనే ఉన్నా ( నిత్యవసరాలు కాదు కాబట్టి అందుబాటులేనే ఉంటాయి ) నేనెప్పుడూ ఈ బ్లాగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. Continue reading

మెదడు ఆలోచించడం మానేసింది. అక్షరాలు బయటకు రానంటున్నాయి. మనసు వికృతంగా తయారైంది. మనుషులు మనుషులను చంపుతున్నారు. దండకారణ్యం నెత్తురోడుతోంది. అడవి తల్లి సాక్షిగా హింస రాజ్యమేలుతోంది. ఢిల్లీ పెద్దల మెదడుల్లో పుట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ చత్తీస్ గఢ్ అడవుల్లో వికటట్టహాసం చేస్తోంది. Continue reading
నమ్మకాలు…ఆచారాలు..వ్యవహారాలు…సంప్రదాయాలు…ఏవైనా సరే…మనిషి జీవితాన్ని పురోగమనం వైపునకు తీసుకువెళితే బాగుంటుంది. కానీ అవే నమ్మకాలు…సంప్రదాయాలు…మనిషిని తిరోగమనం వైపు అనాగరికం వైపునకు నడిపిస్తే..వాటిని నమ్మడం శుద్ధ దండగ. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో ఆనేక ఆచారవ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి చాటునే నిత్యం మూఢనమ్మకాలు కూడా నెలవేసుకుంటాయి. Continue reading
ఇప్పుడు దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఏంటో మీకు తెలుసా…
పేదరికం….కాదు
ఆర్థిక మాంద్యం….కాదు
నిరుద్యోగం……కానే కాదు…
వ్యవసాయ సంక్షోభం….కాదు…
పోనీ ఎండాకాలం కదా…విద్యుత్ సంక్షోభం అసలు కానే కాదు…
మరి ఏంటి…

ఇటు భారత్‌….అటు పాకిస్థాన్‌…రెండు దేశాల మీడియాలోనూ ఇప్పుడు ఒకటే ఇష్యూ. ఒకటే హాట్‌ టాపిక్‌… దాయాది దేశాలైన ఇండోపాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించో…తీవ్రవాద సమస్యల గురించో కాదు..చర్చలు….వాటన్నింటి కంటే సున్నితమైన కుటుంబ వ్యవహారం ప్రపంచ స్థాయిలో రచ్చకెక్కింది. పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌…ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్టాల పెళ్లి ముచ్చటి గురించే అంతా. వివాదాలు వెంట లేకపోతే వాళ్లసలు సెలబ్రిటీలు ఎలా అవుతారు…వీళ్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఓసారి హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షోయబ్‌…మరోసారి అదేఊరమ్మాయి వెంటపడ్డాడు. మొదటి భార్య ఆయేషా సిద్ధిఖీ తెరపైకి వచ్చి ఆధారాలు బయటపెట్టడంతో షోయబ్‌ నిఖానామా సాక్షిగా దొరికిపోయాడు..పాకిస్థాన్‌ వాళ్లను ఎంత వరకూ నమ్మొచ్చు….? భారత్‌,పాకిస్థాన్‌ సంబంధాలవిషయంలో ఆ దేశం ఎప్పుడూ అబద్దాలు చెబుతూనే ఉంటుంది. తీవ్రవాదుల్ని కట్టడి చేసే విషయంలో పాక్ చెప్పేవి అబద్దాలని ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు పాక్‌ క్రికెట్‌ కూడా అదే చేశాడా…? అబద్దాలతో ఇండియన్‌ను మోసం చేశాడా…? నిఖానామా పత్రాలను పాక్‌ మీడియానే బయటపెట్టింది. అయేషాతో తనకు పెళ్లి అయ్యిందని ఓ చానల్‌కు షోయబ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా ఆ దేశ ఛానల్సే ప్రసారం చేశాయి. అయినా సరే.. మాజీ క్రికెటర్‌ నోరు మెదపడం లేదు. సో క్రికెట్‌ నిషేధాన్ని ఎదుర్కొంటూ…ఓ భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైన ఈయనగారిని ఎవరు నమ్ముతారు….? మన సానియా తప్ప

%d bloggers like this: