ఇప్పుడు దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఏంటో మీకు తెలుసా…
పేదరికం….కాదు
ఆర్థిక మాంద్యం….కాదు
నిరుద్యోగం……కానే కాదు…
వ్యవసాయ సంక్షోభం….కాదు…
పోనీ ఎండాకాలం కదా…విద్యుత్ సంక్షోభం అసలు కానే కాదు…
మరి ఏంటి…
ఇంకేంముది…నేడు దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య సానియా పెళ్లి
అవును.టీవీ ఎప్పుడు పెట్టినా కనిపించే మూడే మూడు ఫేసులు సానియా, షోయబ్ మధ్యలో ఆయేషా
వధువు హైదరాబాద్ అమ్మాయి…పైగా అందమైన టెన్నిస్ తార. మీడియాకు ఇంతకు మించి న్యూసేముంటుంది.
సాధారణంగా జాతీయ మీడియా సౌత్ పై పెద్దగా ఫోకస్ చేయదనేది నా ఫీలింగ్.
అప్పుడెప్పుడే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు…ఈ మధ్య తెలంగాణ ఇష్యూ అప్పుడు తప్పిదే దక్షిణాది వార్తలకు వాళ్లు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.
కానీ…షోయబ్ తో సానియా పెళ్లంట అని పాక్ న్యూస్ ఛానల్ బయట పెట్టే సరికి…ఇప్పుడు మన
మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా సానియా ఇంటిని చుట్టు ముట్టేంది.
పాపం ఎవరి బాధలు వాళ్లవి. సానియా, షోయబ్, ఆయేషాలకు కష్టాలున్నట్లే….
పాపం ఈ మీడియా వాళ్లకు కూడా అనేక కష్టాలున్నాయి.

నాకో రిపోర్టర్ మిత్రుడుంటే రాత్రి సమయంలో ఖాళీగానే ఉంటాడు కదా అని ఫోన్ చేశా.

ఎక్కడున్నావ్ అని అడిగితే సానియా ఇంటి ముందు ఉన్న బిల్డింగ్ టెర్రస్ పై అని చెప్పాడు.

ఎందుకంటే ఏమో ఆ ఇంట్లో నుంచి ఎవరు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కదా…

ఎక్స్ క్లూజివ్ నడపాలంటే ఆ మాత్రం బాధలు తప్పవు మరి…

సానియాతో షోయబ్ పెళ్లి జరిగి వాళ్లిద్దరూ దుబాయ్ వెళ్లే వరకో లేక ఆయేషా కేసులో చిక్కు ముడులు

వీడే వరకో…లేక పోతే దీనీ కంటే ప్రబ్మాండం బద్దలయ్యే వార్తఏమైనా జరిగే వరకో టీ వీ స్క్రీన్లపై ఈ ముగ్గురే

కనిపిస్తారు….

Advertisements