నమ్మకాలు…ఆచారాలు..వ్యవహారాలు…సంప్రదాయాలు…ఏవైనా సరే…మనిషి జీవితాన్ని పురోగమనం వైపునకు తీసుకువెళితే బాగుంటుంది. కానీ అవే నమ్మకాలు…సంప్రదాయాలు…మనిషిని తిరోగమనం వైపు అనాగరికం వైపునకు నడిపిస్తే..వాటిని నమ్మడం శుద్ధ దండగ. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో ఆనేక ఆచారవ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి చాటునే నిత్యం మూఢనమ్మకాలు కూడా నెలవేసుకుంటాయి.
ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ లో దుర్మార్గమైన మూఢ సంప్రదాయం అమలులో ఉంది. చంటి పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే మన ప్రాణం అయ్యో అంటుంది. అలాంటిది ఇక్కడ సంప్రదాయం పేరుతో చంటి పిల్లలపై వేడి వేడి పాలు, పాయశం పోసి పూజలు చేస్తూ ఉంటారు. ఓ కుండలో పాలు మరుగుతూ ఉంటాయి. వాటిని తీసుకువచ్చి ఆమాంతం చంటి పిల్లపై పోస్తారు.  ఆ తర్వాత వేడి వేడి పాయశం పోస్తారు. లేత శరీరం కాలడంతో తట్టుకోలేక పిల్లవాడు ఏడుస్తాడు. కానీ ఆ తంతు జరుగుతూనే ఉంటుంది. ఇలా చేస్తే దేవుడు కరుణిస్తాడని…పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వీరి గుడ్డి నమ్మకం. ఇక్కడే నాగరికులుగా చలామణి అవుతున్న మనందరం ఆలోచించాల్సిన విషయాలున్నాయి.

దేవుడు ఉన్నాడా..లేడా అన్నది ఈ సందర్భంలో అప్రస్తుతం కానీ దేవుడి కోసం అంటూ జరుగుతున్న వ్యవహారాలను మాత్రం మనం చర్చించుకోవాలి.

అసలు నిజంగా భక్తుల నుంచి ఏం ఆశిస్తాడు…

మొక్కులు పేరుతోనే…లేకపోతే భక్తి పేరుతోనే శారీరకంగా మనల్ని మనం హింసించుకోవడం ద్వారా లేదా

చిన్నారులను హింసించడం ద్వారా దేవుడు అనుగ్రహం లభిస్తుందా…

అజ్ఞానంతోనే లేక మరే ఇతర కారణాల వల్లో పెద్దలకు అనేక రకాల మూఢ విశ్వాసాలు ఉంటాయి. వాటినితాము ఫాలో అవడమే కాకుండా…తమ పైథ్యాన్ని అభం శుభం తెలియని చిన్నారులపై చూపించడం ఎంత వరకూ సమంజసం…వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిన వాళ్లే  పిల్లల హక్కులను కాలరాస్తున్నట్లు కాదా

మన రాష్ట్రంలో శాంభవిని దేవతను చేశారు…బెజవాడలో మరో పాపను అమ్మవారి అవతారం ఎత్తించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చంటి పిల్లలను మత విశ్వాసాల పేరుతో హింసిస్తున్నారు. ఎక్కడకు పోతున్నాం మనం.

జీ న్యూస్ లో ప్రసారమైన ఆ కథనాన్ని చూసేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://www.zeenews.com/video/showvideo6146.html

Advertisements