మెదడు ఆలోచించడం మానేసింది. అక్షరాలు బయటకు రానంటున్నాయి. మనసు వికృతంగా తయారైంది. మనుషులు మనుషులను చంపుతున్నారు. దండకారణ్యం నెత్తురోడుతోంది. అడవి తల్లి సాక్షిగా హింస రాజ్యమేలుతోంది. ఢిల్లీ పెద్దల మెదడుల్లో పుట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ చత్తీస్ గఢ్ అడవుల్లో వికటట్టహాసం చేస్తోంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పచ్చటి అడవుల్లో నెత్తుటి వేట….దీని ఫలితం…76 మంది జవాన్ల ఊచకోత. నక్సల్స్ ఉద్యమ చరిత్రలోనే ఇంతటి మారణ హోమం ఇంత వరకూ జరగలేదేమో. నక్సలైట్లు ఎందుకు తిరగబడ్డారు…? మావోయిస్టులను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడానికి కేంద్రం పెట్టుకున్న ముద్దు పేరే ఆపరేషన్ గ్రీన్ హంట్. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, కేంద్ర ప్రభుత్వాలు గానీ ఏం చేయాలనుకుంటున్నాయి. వెరీ సింపుల్. నక్సలైట్లను  ఏరి వేస్తేనే నక్సల్ ఉద్యమం అనేదే ఉండదు అనేది ప్రభుత్వాలు గట్టి నమ్మకం. అందుకే క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారాన్ని మన ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. అసంఘటితంగా ఉన్న మావోయిస్టులను తమ పోలీసు బలం ద్వారా ఎదుర్కోవడం.  అదే వారికి తెలిసింది. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాలను ఎలా నడపగలుగుతున్నారు..స్థానికంగా అక్కడి ప్రజల నుంచి వారికి ఎందుకు మద్దతు లభిస్తోంది. ప్రజా ప్రభుత్వాలను నమ్మకుండా ఆయుధాలను అడవి బిడ్డలు ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది…ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. కానీ నోరు మెదపరు. ఎందుకంటే ఆర్థిక శాస్త్రంలో తలపండిన ఇద్దరు మేధావులు పాలిస్తున్న మనదేశంలో సామాన్య మానవుడి దృక్కోణంలో వాళ్ల ఆలోచనలు ఏమాత్రం ఉండవు. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం ప్రముఖ సామాజికవేత్త అరుంధతీ రాయ్ అడవి బాట పట్టి…దంతేవాడలో గిరిపుత్రులను కలిసివచ్చారు. విలువైన ఖనిజ సంపద ఉన్న ఆ భూములను కార్పేరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయం అక్కడ బిడ్డలు జీవితాలనే కోల్పోతున్నారని తన సుధీర్ఘ వ్యాసంలో అరుంధతీరాయ్ ప్రభుత్వ తీరును విమర్శించారు.
నక్సలైట్ల సమస్యకు కేంద్రం వద్ద పరిష్కారం ఉందా…
ప్రతీకారం తీర్చుకుంటాం…వాళ్ల అంతుచూస్తాం..ఎవర్నీ వదిలిపెట్టం….మావోయిస్టులు జపాన్లను ఊచకోత కోయగానే కేంద్ర హోం మంత్రి చిదంబంర, కార్యదర్శి పిళ్లై నుంచి వచ్చిన రియాక్షన్స్. అంటే దాడులు
చేశారు కాబట్టి వీళ్లు ప్రతి దాడులు చేస్తారు…మావోయిస్టులు పోలీసులను పెట్టనపెట్టుకున్నారు కాబట్టి…ఈసారి పోలీసు బలగాలు మావోస్టులను ఏరేస్తాయి. ఇదే కదా అర్థం. కేవలం అడవుల్లో ఉన్న కేంద్ర బలగాలకు
నైతిక స్థైర్యం ఇచ్చేందుకే ఈ ప్రకటలు వచ్చాయా…లేక అంతకు మించి వేరే దారి లేదా..నాకైతే వీళ్ల ప్రకటనలు దిగ్ర్బాంతిని కల్గించాయి. తప్పు జరిగిపోయిందని ఢిల్లీలో కూర్చోని చిదంబరం చాలా సింపుల్ గా చెప్పేశారు. కానీ బలైంది మాత్రం జవాన్లు. అసలు ఎవరిది హింస, ఎవరిది ప్రతిహింస…దశాబ్దాలుగా రక్త చరిత్ర చెబుతున్నవిషయం ఓకటే. పోలీసులు మావోయిస్టులను చంపడం…లేదా మావోయిస్టులు పోలీసులను చంపడం. మావోయిస్టుల సిద్ధాంతాన్ని పక్కన పెడదాం…ప్రభుత్వ విధానాలను పక్కన పెడదాం కానీ రెండు వైపులా జరుగుతున్నది మాత్రం హింస. మనిషిని మనిషి చంపుకోవడం. ఎఁత కాలం ఇలా…దాడులు ప్రతీకార దాడులతో చివరకు ఏం మిగులుతుంది. ఓసారి మావోలది, మరోసారి ప్రభుత్వానిదీ పై చేయి కావచ్చు కానీ అంతిమంగా జరిగేంది ఏంటి…మనిషిని మనిషి చంపుకుంటూ పోతే ఇక మానవ హక్కులకు అర్థం ఏముంటుంది. ప్రభుత్వానికి, నక్సలై్ట్లకు మధ్య అతి పెద్ద జోక్ ఏదైనా ఉంది అంటే అదే చర్చలు. ఎందుకంటే చర్చల పేరుతో ఆంధ్రప్రదేశ్్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ఇదీ గద్దరు సూచిస్తున్న ఫార్ములా….వినడానికి బాగానే ఉంది.కానీ ఎప్పటికి జరిగేను..?
Advertisements