1500 కోట్లకు పైగా సంవత్సర టర్నోవర్‌

ప్రతి ఏటా 15 % పైగా టార్గెట్స్‌

అవసరమైన చోట భారీ పెట్టుబడులు

వద్దనుకుంటే ఉపసంహరణలు

జీతాల చెల్లింపు…ప్రతిభకు తగ్గ సత్కారాలు

ఇవన్నీ వింటుంటే దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్‌ కంపెనీ ఆదాయవ్యయాల లెక్కల్లాగా అనిపిస్తున్నాయి కదా…కానీ కార్పోరేట్‌ ప్రపంచానికి తీసిపోని స్థాయిలో మనీ సామ్రాజ్యం నడుస్తోంది. అదే మావోయిస్టుల మనీ సామ్రాజ్యం. 

అవును మావోయిస్టుల మనీ సామ్రాజ్యం 1500 కోట్లకు పైగానే ఉందని నిఘా వర్గాలు లెక్కకడుతున్నాయి.  హిందూస్థాన్‌ మోటార్స్ యాన్యువల్‌ టర్నోవర్‌ కంటే ఇది చాలా ఎక్కువట. వివిధ మార్గాల ద్వారా మావోలు కూడగడుతున్న కోట్లరూపాయలపై ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆరాతీయడం మొదలు పెట్టాయి. బీహార్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే మావోయిస్టులకు దాదాపు 40 శాతం పైగా రెవెన్యూ అందుతున్నట్లు అధికారుల సమాచారం. ఖనిజ సంపదకు కేంద్రమైన ఒక్క జార్ఖండ్‌ నుంచే మావోలకు సంవత్సరానికి 400 కో్ట్ల వరకూ అందుతుందట. ఇంటిలిజెన్స్‌ లెక్కల ప్రకారం మావోయిస్టులకు ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి. బడా వ్యాపారుల నుంచి….గ్రామస్థుల నుంచి…కార్పోరేట్‌ కంపెనీల నుంచి…ప్రభుత్వ..ప్రైవేటు వ్యక్తుల నుంచి…మనీ కలెక్ట్‌ చేస్తారు. ఇందులో సానుభూతి పరుల నుంచి వచ్చే వాటి కంటే బలవంతపు వసూళ్లే ఎక్కువగా
ఉంటాయి.  సొమ్ములు కలెక్ట్‌ చేసుకోవడం నుంచి వాటి లెక్కా పత్రాలు చూడటానికి మావోలు ప్రత్యేకంగా కొంత మందిని నియమించుకున్నారు. ఇక కేడర్‌లో వారి వారి స్థాయిని బట్టి 250 నుంచి 3000 వేల వరకూ జీత భత్యాలు కూడా ఉంటాయట. ఆయుధాలు సమకూర్చుకోవడం, రేషన్‌, మెడిసెన్‌ కోసం మావోలు
ఎక్కువగా ఖర్చు చేస్తారు.  ప్రభుత్వంపై పోరాటంలో గానీ…అందుకు సహకరించింనందుకు గానీ…పని ఏదైనా సరే…అద్భుత ప్రతిభ కనపరిస్తే…అదనపు ప్రోత్సాహాలు కూడా మావోలు ఇస్తారట. ఈ ఒక్క ఉదాహరణ చాలు మావోల మనీ సామ్రాజ్యం కార్పోరేట్‌ స్థాయిలో ఉందనటానికి …