ఎక్స్ క్లూజివ్…ఎక్స్ క్లూజివ్..ఎక్స క్లూజివ్..తెలుగు న్యూస్ ఛానల్స్ ను ఫాలో అయ్యే వారికి ఈ మధ్య
ఈ పదం ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది. తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు పోటీ అంతా
ఎక్స క్లూజివ్ గా నడుస్తోంది.
ప్రస్తుతం తెలుగులో 13 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వార్తల ప్రసారంలో ఎవరి
స్ట్లైల్ వారిది. కానీ పోటీ పరాకాష్టకు చేరడంతో ఇప్పుడంతా ఎక్స్ క్లూజివ్ బాట పట్టారు. ప్రేక్షకుడి మెప్పు సంపాదించుకునేందుకు ( అంతకంటే ముందు టామ్ రేటింగ్ తెచ్చుకునేందుకు )ఈ వార్తను మేం మాత్రమే
ఎక్స్ క్లూజివ్ గా ఇస్తున్నామంటూ తెగ హడావుడి చేస్తున్నాయి మన ఛానల్స్. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఓకే వార్తను…అన్నీ ఛానల్స్ ఓకే సమయంలో ప్రసారం చేస్తూ ఎక్స క్లూజివ్ అని వేసుకుంటూ ఉంటాయి. ఇదే కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు ఎక్స్ క్లూజివ్ అన్న దానికి అర్థాన్నే మార్చేస్తున్నారు. మరెవరూ ప్రసారం చేయలేని కథనాన్నో…దృశ్యాన్నో ప్రసారం చేస్తే దాన్ని ఎక్స క్లూజివ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ ప్రసారం చేసేది ఓకటే. కానీ ఎవరికి వాళ్లకు అది ఎక్స క్లూజివ్ అన్నమాట. ఉదాహరణకు సానియా పెళ్లినే తీసుకుంటే….సానియా ఇంటి నుంచి బయలు దేరిన దృశ్యాలను రెండు మూడు నిమిషాల తేడాతో అందరూ ప్రసారం చేశారు. కానీ అందరూ ఎవరికి వాళ్లు ఎక్స్ క్లూజివ్ అని వేసుకున్నారు.జనాలు పిచ్చివాళ్లనుకుంటారేమో…ఈ ఛానల్స్ వాళ్లు. రేటింగ్ మాయాజాలంలో పడి విపరీత ధోరణులకు తెరతీస్తున్నారు. ఎక్స్ క్లూజివ్…ఎక్స్ క్లూజివ్..ఎక్స క్లూజివ్..తెలుగు న్యూస్ ఛానల్స్ ను ఫాలో అయ్యే వారికి ఈ మధ్యఈ పదం ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది. తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు పోటీ అంతా ఎక్స క్లూజివ్ గా నడుస్తోంది. ప్రస్తుతం తెలుగులో 13 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వార్తల ప్రసారంలో ఎవరిస్ట్లైల్ వారిది. కానీ పోటీ పరాకాష్టకు చేరడంతో ఇప్పుడంతా ఎక్స్ క్లూజివ్ బాట పట్టారు. ప్రేక్షకుడి మెప్పు సంపాదించుకునేందుకు ( అంతకంటే ముందు టామ్ రేటింగ్ తెచ్చుకునేందుకు )ఈ వార్తను మేం మాత్రమేఎక్స్ క్లూజివ్ గా ఇస్తున్నామంటూ తెగ హడావుడి చేస్తున్నాయి మన ఛానల్స్. ఇంత వరకూ బాగానే ఉందికానీ ఓకే వార్తను…అన్నీ ఛానల్స్ ఓకే సమయంలో ప్రసారం చేస్తూ ఎక్స క్లూజివ్ అని వేసుకుంటూ ఉంటాయి.ఇదే కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు ఎక్స్ క్లూజివ్ అన్న దానికి అర్థాన్నే మార్చేస్తున్నారు. మరెవరూప్రసారం చేయలేని కథనాన్నో…దృశ్యాన్నో ప్రసారం చేస్తే దాన్ని ఎక్స క్లూజివ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడుఅందరూ ప్రసారం చేసేది ఓకటే. కానీ ఎవరికి వాళ్లకు అది ఎక్స క్లూజివ్ అన్నమాట. ఉదాహరణకు సానియాపెళ్లినే తీసుకుంటే….సానియా ఇంటి నుంచి బయలు దేరిన దృశ్యాలను రెండు మూడు నిమిషాల తేడాతోఅందరూ ప్రసారం చేశారు. కానీ అందరూ ఎవరికి వాళ్లు ఎక్స్ క్లూజివ్ అని వేసుకున్నారు.జనాలు పిచ్చివాళ్లనుకుంటారేమో…ఈ ఛానల్స్ వాళ్లు. రేటింగ్ మాయాజాలంలో పడి విపరీత ధోరణులకు తెరతీస్తున్నారు.
Advertisements