ఉంటే మేమైనా ఉండాలి….వాళ్లైనా ఉండాలి…!!!
గొంతులో ప్రాణముండగా…వాళ్లను అడుగు
పెట్టనీయం…!!! తుపాకీ తూటాలు పేల్చినా…కాలి
బూట్లతో ఖాకీ కావరం ప్రదర్శించినా…సోం పేట
గొంతుకలన్నీ ఇవే మాటలు చెబుతున్నాయి. సోం
పేట గుండెల్లో నుంచి తుపాకీ తూటాలు దూసుకెళ్లినా
అక్కడి ప్రజలు మాత్రం ధర్మల్‌ ప్లాంట్‌ను పొలిమేరల నుంచే తరిమికొడతామంటున్నారు..
ఎటు చూసినా పచ్చని పంట పొలాలు…
ఆహ్లాద గొలిపే ప్రకృతి రమణీయత…
చేరువలోనే సముద్ర తీరం….
కాయ కష్టం చేసుకునే పల్లె వాసులు…
వీరి జీవితాలనే కాల్చుకుతినేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది నాగార్జున కన్‌స్ట్రక్షన్  కంపెనీ…ఇక్కడి
ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేదు… కారణం   థర్మల్‌ పవర్ ప్లాంట్‌…. 2640 మెగా
వాట్ల విద్యుత్‌ ఉత్పత్రి చేసే మెగా ప్రాజెక్ట్‌….
1300 కోట్ల వ్యయంతో 2200 ఎకరాల్లో నిర్మిస్తున్న
ఈ ప్లాంట్‌కు స్థానికుల అభిప్రాయాలతో సంబంధం
లేకుండా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దాని
ఫలితమే బడుగు జీవులను చీల్చిన తూటాలు..
సోంపేట పరిధిలోని 28 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా
సరే NCC గో బ్యాక్‌ అంటూ బోర్డులు కనిపిస్తాయి..
ప్రజల నినాదాలు వినిపిస్తాయి…
పచ్చని బతుకుల్లో ధర్మల్‌ ప్లాంట్‌ చిచ్చుపెడుతోందని
ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
బడా కంపెనీలకు అమ్ముడు పోయిన ప్రభుత్వం
మత్స్యకారుల జీవితాలను బొగ్గు పాలు చేస్తోందని
ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర అనుమతులు
రాకున్నా దొద్దిదారిన NCC ప్రాజెక్ట్‌ నిర్మిస్తోందని
ఆరోపిస్తున్నారు.మమ్మల్ని కాల్చి కరెంటు ఎవరికిస్తారని సోంపేట
వాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
బడుగుల ప్రాణాలు తీసేందుకు ప్రభుత్వ పోలీసు
తూటాలు పేల్చినా…ఇక్కడి ప్రజలు మాత్రం
వెనుకడుగు వేయడం లేదు. సోంపేట కాల్పుల
ఘటన సాక్షిగా ప్రాణాలు తెగించి పోరాడటానికి
సిద్ధమవుతున్నారు….

ఉంటే మేమైనా ఉండాలి….వాళ్లైనా ఉండాలి…!!!గొంతులో ప్రాణముండగా…వాళ్లను అడుగు పెట్టనీయం…!!! తుపాకీ తూటాలు పేల్చినా…కాలిబూట్లతో ఖాకీ కావరం ప్రదర్శించినా…సోం పేటగొంతుకలన్నీ ఇవే మాటలు చెబుతున్నాయి. సోంపేట గుండెల్లో నుంచి తుపాకీ తూటాలు దూసుకెళ్లినాఅక్కడి ప్రజలు మాత్రం ధర్మల్‌ ప్లాంట్‌ను పొలిమేరల నుంచే తరిమికొడతామంటున్నారు..

ఎటు చూసినా పచ్చని పంట పొలాలు… ఆహ్లాద గొలిపే ప్రకృతి రమణీయత… చేరువలోనే సముద్ర తీరం…. కాయ కష్టం చేసుకునే పల్లె వాసులు… వీరి జీవితాలనే కాల్చుకుతినేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది నాగార్జున కన్‌స్ట్రక్షన్  కంపెనీ…ఇక్కడిప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేదు… కారణం   థర్మల్‌ పవర్ ప్లాంట్‌…. 2640 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్రి చేసే మెగా ప్రాజెక్ట్‌…. 1300 కోట్ల వ్యయంతో 2200 ఎకరాల్లో నిర్మిస్తున్నఈ ప్లాంట్‌కు స్థానికుల అభిప్రాయాలతో సంబంధంలేకుండా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దానిఫలితమే బడుగు జీవులను చీల్చిన తూటాలు.. సోంపేట పరిధిలోని 28 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినాసరే NCC గో బ్యాక్‌ అంటూ బోర్డులు కనిపిస్తాయి..ప్రజల నినాదాలు వినిపిస్తాయి… పచ్చని బతుకుల్లో ధర్మల్‌ ప్లాంట్‌ చిచ్చుపెడుతోందనిఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. బడా కంపెనీలకు అమ్ముడు పోయిన ప్రభుత్వంమత్స్యకారుల జీవితాలను బొగ్గు పాలు చేస్తోందనిప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర అనుమతులురాకున్నా దొద్దిదారిన NCC ప్రాజెక్ట్‌ నిర్మిస్తోందనిఆరోపిస్తున్నారు.మమ్మల్ని కాల్చి కరెంటు ఎవరికిస్తారని సోంపేటవాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బడుగుల ప్రాణాలు తీసేందుకు ప్రభుత్వ పోలీసుతూటాలు పేల్చినా…ఇక్కడి ప్రజలు మాత్రంవెనుకడుగు వేయడం లేదు. సోంపేట కాల్పులఘటన సాక్షిగా ప్రాణాలు తెగించి పోరాడటానికిసిద్ధమవుతున్నారు….

Advertisements