2 G స్పెక్ట్రమ్‌….

వందలా…వేలా….లక్షా 76 వేల కోట్ల రూపాయలను అప్పనంగా దిగమింగిన తమిళ తంబి రాజా వారి కుంభకోణం ఎఫెక్ట్‌… రాముడు మంచి బాలుడు

అన్నంత పేరున్న మన్మోహన్‌ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది…

ప్రతిపక్షం ఎఫెక్టో…మీడియా ఇన్వెస్టిగేషన్‌ పుణ్యమో రాజా వారిని ఇంటికి సాగనంపినా…ప్రధానిని మాత్రం 2 G స్పెక్ట్రం బొమ్మాళిలా వెంటాడుతోంది.

సుప్రీం కోర్టులో చీవాట్లు తిన్న ప్రధాని మన్మోహన్‌కు నేషనల్‌ మీడియా మరో షాక్ ఇచ్చింది.  స్పెక్ట్రం మూలాలను తవ్వితే చివరకు అవి ప్రధాని

ఇంటి వద్ద తేలాయి…టెలికాం మంత్రిగా రాజా లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో తేలిపోయింది.

కేంద్రంలో అధికారం నడిపేందుకు కాంగ్రెస్‌కు కావాల్సన  బలాన్నిచ్చిన డీఎంకే….2 G స్పెక్ట్రం విషయంలో ఏనాడో ప్రధాని చేతులు కట్టేసింది.

స్పెక్ట్రం వ్యవహారంలో పారదర్శకత ప్రదర్శించేందుకు 2006లో కేంద్రం ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో ఓ మంత్రుల బృందాన్ని నియమించింది. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌కు తెలియకుండా స్పెక్ట్రం కేటాయింపుల్లో ఒక్క ఫైలు కూడా కదలడానికి వీలులేదు… ఇక్కడే DMK ప్రధానిని బుక్ చేసింది.

స్పెక్ట్రం కేటాయింపుల నిర్ణయాన్ని మంత్రుల బృందం పరిధిలోనుంచి తప్పించాలంటూ అప్పటి టెలికాం మంత్రి దయానిధి మారన్‌….స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. PMO కూడా అందుకు అంగీకరించింది. ఇంకేముంది  మంత్రుల బృందం పర్యవేక్షణ లేకపోవడంతో..టెలికాం మంత్రిత్వ శాఖలో అడ్డగోలు వ్యవహారం నడిచింది.

మన్మోహన్‌ను అడ్డంపెట్టుకొని డీఎంకే పబ్బం గడుపుకుంటే….ఇప్పుడు ఆయన పీఠానికే ఎసరు వచ్చిన పరిస్థితి….

సో….మన్మోహన్ జీ….ఇప్పటికైనా మీ మౌనం వీడండి….దేశం ఎందుకు లూఠీ అయ్యిందో జనానికి చెప్పండి…..

 

Advertisements