తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియాకు ముఖ్యంగా న్యూస్‌ ఛానళ్లకు ఈ మధ్య రెండు భయంకరమైన రోగాలు సోకాయి. ఒకటి ఎక్స్‌క్లూజివ్ రోగం…రెండోది మా ఎఫెక్టే అని చెప్పుకోవడం…

ఈ రెండు రోగాలు ఎలా అవుతాయని డౌట్‌ వచ్చినా ఖచ్చితంగా ఈ రెండూ రోగాలే అవుతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ…ఈ రెండు రోగాలను చాలా క్లోజ్‌గా పరిశీలిస్తూ నేను

ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి…

 

ఎలక్ట్రానిక్‌ మీడియాకు సోకిన ఈవైరస్‌ల గురించి కాస్త డిటేల్డ్‌గా చెప్పుకుందాం…

 

ఎక్స్‌క్లూజివ్‌ న్యూస్‌

 

ఈ మధ్య ఏ న్యూస్‌ ఛానల్‌ పెట్టినా సరే…ఛానల్‌ లోగో, స్క్రాలింగ్‌, ప్రసారమవుతున్న వార్తతో పాటు కుడి నుంచి ఎడమకు తాటికాయంత అక్షరాలు వెళ్తూ ఉంటాయి. అదే ఎక్స్‌క్లూజివ్‌ ( టీవీ పరిభాషలో వాటర్ మార్క్ అందురు).  రాష్ట్రంలో 12కు పైగా ఉన్న న్యూస్ ఛానల్స్‌…ఎక్స్‌క్లూజివ్‌ అన్న పదానికి అర్థాన్నే మార్చేశాయి.  అసలు ఏది ఎక్స్‌క్లూజివ్‌ న్యూస్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్‌ క్లూజివ్‌ వాడాలి అన్నదానికి నియమం అంటూ లేకుంటా పోయింది. వాస్తవానికి తమ దగ్గర మాత్రమే ఉండి…మరే ఇతర ఛానల్స్‌ దగ్గరా లేని వార్తకో, విజువల్స్‌కు, న్యూస్ ఐటం కో ఎక్స్ క్లూజివ్ వేసుకోవచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగా వాళ్ల టీం ఎఫర్ట్‌ కాబట్టి, పైగా అది పూర్తిగా ఆ ఛానల్‌కే చెందుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ కూడా ఈ నియమాన్ని ఫాలో అవడం లేదు.

పక్క ఛానళ్ల వాళ్లు ఒక్క సెకన్‌, ఒకే ఒక్క సెకన్‌ లేటుగా ప్రసారం చేసినా సరే…ముందు మనమే టెలికాస్ట్ చేశాం కాబట్టి అప్పటికి అది మనకి ఎక్స్‌క్లూజివ్‌ అన్నది ఇప్పడు ఛానల్స్ ఫాలో అవుతున్న ఫార్ములా. కొన్ని ఉదాహరణలు చూద్దాం….

అల్లు అర్జున్‌ ఎంగేజ్‌మెంట్‌ జరుగుతోంది. ముందు ఒకఛానల్‌ విజువల్‌ను బ్రేక్ చేసింది. ప్రేక్షకులకు అన్ని ఛానల్స్ కంటే ముందు ఈ ఛానల్‌ ఇచ్చింది కాబట్టి ఫస్ట్‌ ఆన్‌ అని వేసుకోవచ్చు. అంత వరకూ అభ్యంతరం లేదు….కానీ పక్క ఛానల్స్‌ కూడా ఆ విజువల్స్‌ను ఇస్తున్నా కూడా…తమ దగ్గర మాత్రమే ఉన్నట్లు ఎక్స్‌ క్లూజివ్‌ అని వేస్తూ ఉంటారు. ప్రేక్షకుడి చేతిలో రిమోట్ ఉంటుంది. ఒకే ఒక్క ఛానల్‌కు అతుక్కొని ప్రేక్షకుడు ఎప్పుడూ ఉండదు. అన్ని ఛానల్స్‌ను సర్ఫ్ చేస్తూ ఉంటాడు. అన్నింటిలోనూ ఒకే వార్త ( ఒకే విజువల్స్‌ ) ప్రసారమవుతా ఉంటాయి…అయినా అన్ని ఛానల్స్‌ ఎవరికి వాళ్లు ఎక్స్‌ క్లూజివ్ అని వేసుకుంటారు. రేటింగ్స్‌లో నెంబర్‌ వన్ స్థానంలో ఉన్న ఛానల్‌ నుంచి అట్టడుగునున్న ఛానల్‌ వరకూ అందిరిదీ ఇదే పంధా. అది చూసే ప్రేక్షకుడికి దిమ్మ తిరిగిపోతుంది.

పక్క ఛానల్స్‌ దగ్గర సేమ్ విజువల్స్ ఉన్నప్పుడు… వాళ్లు కూడా సేమ్ స్టోరీని ప్రసారం చేస్తున్నట్లు…ఎక్స్ క్లూజివ్‌ అని వేసుకోవడంలో అర్థం లేదన్నది నా వాదన. ఈ విషయాన్ని ఛానల్స్ ఎందుకు గుర్తించవో అర్థం కాదు.  అయితే విపరీతమైన పోటీ కారణంగా ప్రేక్షకుడికి ముందు మేమే చూపించాలన్న ఆశతో మీడియా సంస్థలు దృశ్య చౌర్యానికి కూడా పాల్పడుతున్నాయి. అంటే వేరే ఛానల్‌లో వచ్చిన దాన్ని రికార్డ్ చేసి వేసుకోవడం. ఆయా ఛానల్స్‌ మధ్య అవగాహన ఉంటే ఒకే..అందులో అభ్యంతరం ఏమీ ఉండదు కానీ…ఎదుటి వాడి ఎక్స్ క్లూజివ్ విజువల్స్ కాపీ కొట్టి ఇంకొక ఛానల్స్ ఎక్స్‌ క్లూజివ్ అని  వేసుకోవడం ఎంత వరకూ సంమంజసం.

బాబ్లీ ఎపిసోడ్‌లో మహారాష్ట్ర పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం కేవలం ఒకే ఒక్క ఛానల్‌ దగ్గర మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు ఛానల్‌ కూడా వారి సౌజన్యంతోనే వేసుకున్నారు. కానీఓ ఘనత వహించిన ఛానల్ మాత్రం పక్క ఛానల్‌ ఎక్స్‌ క్లూజివ్‌ పై తమ ఛానల్‌ లోగో వచ్చే లా వాటర్ మార్క్‌ను ఎడిటింగ్ మాయాజాలంతో మాయచేసి తమ ఎక్స్ క్లూజివ్‌ అని ప్రసారం చేసుకుంది. జనాలు చూస్తారో లేదో తెలియదు కానీ ఛానల్స్ మాత్రం ప్రత్యేకం అని వేసుకోవడానికి తెగ హడావుడి చేస్తూ ఉంటాయి.

 

మా ఎఫెక్ట్ అని చెప్పుకోవడం

 

ఈ మధ్య కొన్ని ఛానల్స్‌కు ఈ జబ్బు కూడా ఎయిడ్స్ స్థాయిలో అంటుకుంది. రోశయ్య రాజీనామా..కిరణ్‌ కుమార్ ప్రమాణం వరకూ చూసుకుంటే….మీడియా మధ్య పోటీ

ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది.  రోశయ్య రాజీనామా చేస్తాడని ముందే చెప్పాం కిరణ్‌కు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ముందే చెప్పాం….అంటూ ఊకదంపుడుగా ప్రోమోలు

కూడా నడుపుతున్నాయి.  సొంత డబ్బా కొట్టుకోవడం వల్ల ఛానల్స్ రేటింగ్‌ పెరుగుతాయా…? అసలు ప్రేక్షకులకు కావాల్సింది ఏమిటి….? సొంత డబ్బాతో ఛానల్‌ క్రెడిబిలిటీ

పెరుగుతుందని నేనైతే అనుకోను.

Advertisements