దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ జర్నలిస్ట్‌…తనపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూవాటిపై వివరణ ఇచ్చుకునేందుకు తాను పనిచేస్తున్న టెలివిజన్‌ ఛానల్‌లోనే చర్చా కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి….దేశ చరిత్రలో బహుశా ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. కానీధైర్యసాహసాలతో కూడిన రిపోర్టింగ్‌కు పెట్టిందిపేరైన బర్ఖాదత్‌కు ఆ పరిస్థితే వచ్చింది.

నీరా రాడియా…కార్పోరేట్‌ లాబీయింగ్‌ టేపుల వ్యవహారంలో… డీఎంకే రాజాకు మంత్రి పదవి వచ్చేలా చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో లాబీయింగ్ చేశారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న బర్ఖాదత్‌ కాస్త లేటుగా తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కేవలం వెబ్‌ సైట్‌ ద్వారా మాత్రమే ఇప్పటి వరకూఆరోపణలకు సమాధానం ఇచ్చిన బర్ఖా….సీనియర్‌ ఎడిటర్స్‌తో ఒపెన్ డిబేట్‌కు సిద్ధమయ్యారు.NDTV సీనియర్ మేనిజింగ్ ఎడిటర్‌ సోనియా సింగ్‌ ఆధ్వర్యంలో ఈ డిబెట్‌ జరిగింది. ( రాత్రి పదిగంటలకు NDTVలో ప్రసారమైంది ) నిష్ణాతులైన నలుగురు ఎడిటర్స్‌ బర్ఖాదత్‌ తప్పుచేశారా లేదా అని తేల్చే పని చేశారు. నీరారాడియాతో బర్ఖాదత్‌ టెలిఫోన్ సంభాషణలను తొలిసారిగా ప్రచురించిసంచలనానికి తెరలేపిన ఓపెన్‌ మ్యాగజైన్ ఎడిటర్‌ మను జోసెఫ్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.ఒకప్పటి ప్రధాని మీడియా సలహాదారు, ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్‌ ఎడిటర్‌ తెలుగువాడు సంజయ్‌బారు, టైమ్స్‌ ఆఫ్ ఇండియా మాజీ ఎడిటర్ దిలీప్‌ పద్‌గోన్కర్‌, ఇండియా టుడే మాజీ ఎడిటర్‌స్వపన్ దాస్‌ గుప్తాలు ఇందులో పాల్గొన్నారు. 

బర్ఖా గీత దాటారా లేదా…?

గీత దాటలేదనేదే బర్ఖాదత్‌ పదే పదే చెబుతున్న సమాధానం. కేవలం తాను  వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించానని…ఎలాంటి లాబీయింగ్‌లకు పాల్పడలేదనేది బర్ఖా సమాధానం. అయితే బర్ఖా సమాధానంపైనే ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎడిటర్లు సంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్న బర్ఖా చేసినా…ప్యానెల్ లో ఉన్న ఎవరూ సంతృప్తి చెందలేదు. ముఖ్యంగాఓపెన్ మాజగైన్ ఎడిటర్ మనుజోసఫ్ బర్ఖాదత్ అనుసరించిన జర్నలిజంవిలువలను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఒక కార్పేరేట్ పీఆర్ ( రాడియా)కేంద్ర ప్రభుత్వంలో ఎవరెవరికి ఏ పదవి ఉండాలనే విషయాన్ని నిర్ణయిస్తున్నప్పుడు కార్పోరేట్ లాబీయింగ్ పేరుతో వార్తను ఎందుకు ప్రసారం చేయలేకపోయారు అని మను సూటిగా ప్రశ్నించారు. 2009లోనూ 2010లో కూడా ఎన్ డీ టీ వీ ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేయలేదనేది మను ఆరోపణ. ఎన్డీటీవీ ఆ కోణంలో వార్తను ప్రసారం చేసి ఉంటే  biggest story of the decade అయి ఉండేదనిమను వాదించారు. దానికి బర్ఖాదత్ మాకు అలా అనిపించలేదు అనిచెప్పి పొడి పొడి సమాధానం చెప్పారు.

అయితే తాను జరిపిన సంభాషణలను ఎడిట్ చేసి ప్రసారం చేయడంపైబర్ఖా అభ్యంతరం వ్యక్తం చేశారు. పొలిటికల్ జర్నలిస్టుగా వివిధ వర్గాలనుంచి న్యూస్ సేకరించే వృత్తి ధర్మంలో భాగంగా రకరకాల మనుషులతోమాట్లాడాల్సి ఉంటుంది. నేనూ అదే చేశాను.అసలు రాజా అనే వ్యక్తినేతాను ఎప్పుడూ కలవనప్పుడు అతనికి మంత్రి పదవి రావడం కోసం తానెందుకు లాబీయింగ్ చేస్తానన్నది బర్ఖా ప్రశ్న.

మొత్తం మీద ఈ ఓపెన్ డిబెట్ కు మాత్రం లాజికల్ కంక్లూజన్ మాత్రం దొరకలేదు…మనిషి అన్నాక తప్పులు జరుగుతూ ఉంటాయి. జర్నలిస్టుగా నేనూ కొన్ని పొరపాట్లు చేశాను. తప్పో , పొరపాటే..అంగీకరించవచ్చు కదా….అని సంజయ్ బారు ఇచ్చిన సలహా బర్ఖాను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అందుకే తాను పక్కా ప్రొఫెషనల్ జర్నలిస్టుగానే వ్యవహరించానని…ఈ విషయంలో చేయని తప్పుకు తలవంచేది లేదని బర్ఖా తెగేసి చెప్పింది.

వాస్తవానికి బర్ఖా చెప్పేదాంట్లో కూడా అర్థం ఉంది. జర్నలిస్ట్ కు సోర్సేప్రాణం. ఒక్కోసారి ఆ సోర్స్ ల నుంచి వచ్చే కథనాలే సంచలనాత్మకకథనాలుగా మారతాయి.అయితే ఇక్కడ ప్రశ్నమాత్రం బర్ఖా దత్ కానీ,వీర్ సంఘ్వీ కానీ…తమ వృత్తి సంబంధాలకు లోబడే సోర్సులతో సంబంధాలు కొనసాగించారా లేక…తమకున్న పలుకుబడిని ఉపయోగించిజర్నలిస్టులు కాస్తా లాబీయిస్టులుగా మారిపోయారా అన్నదే.

Advertisements