పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తులో తన ఉనికిని కాపాడుకోగలదా….? ఈ సందేహం వచ్చింది ఎవరికో కాదు…సాక్ష్యాత్తూ దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ గారికి. అవును. ఆయన ఈ స్థాయిలో భయాందోళనలు వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. 

 

దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాంగా చరిత్ర కెక్కిన స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం యూపీఏ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వతహాగా మంచివాడిగాఎలాంటి మచ్చలేనివాడిగా పేరున్న మన్మోహన్‌ను ఒకదానిపై మరొకటి కుంభకోణాలుఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మౌనం అర్థాంగికారం అంటారు. కానీ మన్మోహన్‌ విషయంలోఆయన మౌనమే ప్రతిపక్షాల దృష్టిలో చేతగానితనంగా మారిపోయింది. లక్షా ౭౩ వేల కోట్ల రూపాయాల ప్రజాధానం దుర్వినియోగమైనప్పుడు…తన కేబినెట్‌ సహచరుడే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక బాధ్యత గల ప్రధానిగా వెంటనే స్పందించి ఉంటేబాగుండేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. చివరకు సుప్రీం కోర్టు చేతిలో కూడా చీవాట్లు తిన్నారు. మీడియా ఒత్తిడితోనే లేక రాజకీయంగా పరువు పోకూడదనే డీఎంకేనేతస్పెక్ట్రం సూత్రధారి రాజా తప్పుకున్నా….కుంభకోణం కుంభకోణంగానే మిగిలిపోయింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు ఆ ప్రజల సొమ్మునే దిగమింగేశారు. చివరకు వ్యవహారం పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. స్పెక్రం ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీసేందుకు జేపీసీ వేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి.

ఈ జేపీసీ దగ్గరే సభ ఆగిపోయింది. ఇప్పటి వరకూ ఒక్క క్షణం కూడా సజావుగా సాగిన దాఖలాలు లేవు. ప్రతిపక్షాలు జేపీసీ కోసం పట్టుపట్టడం, సభాపతిసభను వాయిదా వేయడం…రోజూ ఇదే తంతు. సభ ఎజెండా పక్కన పడిపోయింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా అయ్యింది. అయినా ప్రభుత్వానికి కానీ మన ఎంపీలకు గానీ చీమకుట్టినటెユ్టనా లేదు. ఇక్కడ ముద్దాయి కాంగ్రెసా లేక బీజేపీనా లేకయూపీఏనా, ఎన్‌డీఏనా అన్నది కాదు. మొత్తం రాజకీయ వ్యవస్థే ప్రజల ముందు ముద్దాయిగా నిలబడింది. జేపీసీ వేయగానే వాస్తవాలు బయటకు వస్తాయని, దోషులకు శిక్ష పడుతుందని, ప్రజల సొమ్ము వెనక్కి వస్తుందన్న ఆశ అయితే నాకు లేదు. కానీ జేపీసీద్వారా రాజ్యాంగబద్దమైన విచారణ అయితే మొదలవుతుంది. మరి యూపీఏ సర్కార్‌ ఎందుకు స్పందించదు

“I have repeatedly told the opposition that existing mechanisms can do what a JPC can”  ఇదీ ప్రధాని సమాధానం.

దేశ చరిత్ర తెలిసిన ఎవరికైనా ఓ విషయం మాత్రం తెలుసు. ఎన్ని కుంభకోణాల్లో, ఎన్ని విచారణకు నోచుకోని, ఎంతమందికి శిక్ష పడిందో పెద్దగా చెప్పుకోనవసరం లేదు. ప్రధానికి ఆ విషయం అర్థం కానట్టుంది. జేపీసీవేస్తే అసలు గుట్టు రట్టవుతుందన్న భయం యూపీఏ ప్రభుత్వానికి ఉందా…? అందుకేజేపీసీ విషయంలో వెనకడుగు వేస్తుందా…? ప్రతిపక్షాలదే కాదు ప్రజలకు కూడా ఇలాంటిసందేహాలే వస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు గురించి తెగ ఆందోళనచెందుతున్న ప్రధాని గారికి జేపీసీ వేయడం ద్వారా వచ్చిన నష్టమేమిటి….? స్పెక్ట్రం తీగ లాగిన సుప్రీం కోర్టు ఎన్‌డీఏ హయాంలో జరిగిన కేటాయింపులను కూడా లెక్క తేల్చాలని ఆదేశించింది. సో ఇందులో ఎవరు పత్తిత్తులో…ఎవరు దోషులో సీబీఐ విచారణ పూర్తయితే కానీ తెలియదు. అది ఎప్పటికి జరుగుతుంది…? ఎప్పటికి పూర్తవుతుంది..?

Advertisements