అద్భుతం…మహాద్భుతం..గ్రేట్‌ ఇండియన్‌ తమాషా….ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని పనిని మనవాళ్లు చేసి చూపించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పార్లమెంటరీప్రజాస్వామిక వ్యవస్థకు సరికొత్త అర్థాన్ని చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చించకుండానే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. 25 యేళ్లలో ఎప్పుడూ లేని విధంగా జీరో బిజినెస్‌తో సభ ముగిసింది. శీతాకాల సమావేశాల్లో దాదాపు 114 గంటల విలువైన సభా సమయంగంగలో కలిసిపోయింది. పార్లమెంట్‌పై దాడి ఘటనకు 9 యేళ్లు పూర్తయిన సందర్భంగా నివాళులు అర్పించడానికి ఏకమైన ప్రభుత్వ, ప్రతిపక్షాలు సభనుసజావుగా నడిపించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాయి.

ఎవరిని నిందించాలి…?

నవంబర్‌ ౯న ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలుఏరోజూ కనీసం ఒక్క పది నిమిషాలైనా సజావుగా సాగలేదు. ౨ జి స్పెక్ట్రం కుంభకోణమే దీనికి కారణం. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (jpc) కోసం పట్టుబడ్డవిపక్షాలు సభను అడుగడుగునా అడ్డుకున్నాయి. ౧.౭౬ వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు. నీతి నిజాయితీల్లో తమ అంతటి వాళ్లులేరని చెప్పుకునే సోనియా, మన్మోహన్‌లు ఈ కుంభకోణం విషయంలో మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించారు. కేవలం ప్రతిపక్షాలకే కాదు…2 జి కేటాయింపులవిషయంలో దేశ ప్రజలకు కూడా ఎన్నో అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నివృత్తిచేయాల్సిన సర్కార్‌ చట్టం తన పని తాను చేసుకుపోతుంది లాంటి రొటీన్‌ పొలిటికల్‌డైలాగులు చెప్పి తప్పించుకోబోచూసింది. కానీ ప్రతిపక్షాలు వదిలి పెట్టలేదు. అసలేబీహార్‌ ఎన్నికల గెలుపుతో మాంచి ఉత్సాహంగా ఉన్న ఎన్‌డీఏ పక్షాలు…డైరెక్ట్‌గా ౧౦ జన్‌పధ్‌నే టార్గెట్‌ చేశాయి.

ఓ వైపు ప్రతిపక్షం, మరోవైపు ప్రభుత్వ పక్షం, మధ్యలో 2 జి స్పెక్ట్రం. ఎవరూ వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి ప్రజలకు జవాబుదారీ తనం ప్రతిపక్షాలకంటే ప్రభుత్వ పక్షానికే ఎక్కువగా ఉంటుంది. ఇంత పెద్ద కుంభకోణంలో తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసి ఉంటే…ఇటు ప్రతిపక్షం..అటు ప్రజలు కూడా నమ్మేవారు. కానీ మొదటి నుంచి యూపీఏసర్కార్‌ జేపీసీ వేయడానికి వెనుకడుగు వేస్తూనే వస్తోంది.

వైపు జాతీయ మీడియా స్పెక్ట్రం కుంభకోణంలో రోజురోజుకూ తీగలాగుతూ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నా…సుప్రీం కోర్టు తీవ్రవ్యాఖ్యలతో నిలదీస్తున్నా…..మేడం సోనియా ప్రభుత్వానికి చీమ కుట్టినటెユ్టనా లేదు.మొత్తం సభ జరిగిన తీరును గమనిస్తే ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టం కనిపించింది.జేపీసీని వేస్తే అసలుకే మొసం వస్తుంది. సో…ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగకూడదు. సాగినంత కాలం సాగనిద్దాం. ఇదే ధరణి కనిపించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థ మనుగపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని కానీ…అవినీతి విషయంలో మీరుమాకు నీతులు చెప్పేదేంటని ప్రగల్భాలు పలికిన సోనియమ్మ కానీ…పార్లమెంట్‌నుసజావుగా నడపడానికి ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఫలితం…కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా. కాలం వెళ్లబుచ్చడం తప్ప సభలో జరిగిందిఏదీ లేదు. ఇందుకేనా పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేసుకుంది. అటు ప్రతిపక్షం కోరిందీ జరగలేదు…ఇటు ప్రజా సమస్యలు నెరవేరలేదు. నిర్మాణాత్మకచర్చలూ చేపట్టలేదు….ఈ పాపం ఎవరదనుకోవాలి….? నిజాయితీ లోపించినపార్టీలదా… లేక ప్రజా ప్రతినిధులుదా…?

Advertisements