దయచేసి వినండి…!!!  ట్రైన్‌ నెం: రెండు-సున్నా-సున్నా- ఒకటి- కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ..దేశం మొత్తం తిరగాల్సిన బడ్జెట్‌ రైలు..మరికొన్ని

గంటల్లో పార్లమెంట్‌ ఫ్లాట్‌ ఫారం మీదకు రాబోతోంది  డిపార్ట్‌మెంటల్‌ అనౌన్స్‌మెంట్‌..!వాయువేగంతో దూసుకొస్తున్న ఈ మమత ఎక్స్‌ప్రెస్‌..కొన్ని రాష్ట్రాల్లో

ఆగక పోవచ్చు..!!! అందులో ఎప్పటి లాగే ఆంధ్ర ప్రదేశ్‌ కూడా ఉండొచ్చు…!!! ఎన్నికల వేళ బెంగాల్‌ ఓటర్ల వెంట పడ్డ దీ గ్రేట్ మమతా బెనర్జీ…బడ్జెట్‌

ఎక్స్‌ప్రెస్‌ను స్వరాష్ట్రం వైపు ఎప్పుడో దారి మళ్లించేశారు….

అంతా జనరంజకం….

సామాన్యుడికే బడ్జెట్‌ అంకితం

 

రైల్వే బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్ది..పట్టాలెక్కించడానికి కొన్ని గంటల ముందు ఆశాఖ మంత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీ

ఇది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే బడ్జెట్‌ను మమత బెనర్జీ ఇవాళ మధ్యాహ్నం  12 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు…మన రాష్ట్రంతో పాటు ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకున్నా….మమత బెనర్జీ ఎక్స్‌ ప్రెస్ మాత్రం.. నాన్‌ స్టాప్‌గా  వెస్ట్ బెంగాల్ వైపే దూసుకెళ్లనుంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో  మమత కరుణంతా రంగరించి

బెంగాల్‌ పైనే కురిపించనున్నారు. బెంగాల్ కోసం రెండు రైల్వే ఆడిటోరియాలను, ఈశాన్య భారతానికి భారీ రైల్వే ప్రాజెక్ట్‌ను ఇచ్చే ఆలోచనలో దీదీ ఉన్నారు…

పీపుల్‌ ఫ్రెండ్లీ, ప్యాసింజర్ ఫ్రెండ్లీగా బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్న మమత బెనర్జీ…సామాన్య ప్రయాణికుల ఛార్జీలు పెంచకుండా ఈసారి కూడా

వారికి ఊరట కల్పించనున్నారు. ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ ఛార్జీలు మాత్రం కొద్దిగా పెరిగే సూచనలున్నాయి…

కొత్తగా 100 ట్రైన్స్‌ను ఏర్పాటు చేయడం,  దేశంలోని రెండు ప్రధాన నగరాల మధ్య హై స్పీడ్‌ ఫెసిలిటీ, 12 దురంతో ఎక్స్‌ప్రెస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, లాంగ్ జర్నీ ట్రైన్స్‌లో డాక్టర్ల సౌకర్యం,  వెయిటింగ్‌ లిస్ట్ టికెట్ కన్ఫార్మైతే SMS సందేశం,  తక్కువ ధరకే భోజన ఏర్పాట్లు చేస్తూ కొత్త కాటరింగ్ పాలసీ,  పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు తత్కాల్ స్కీంలో టిక్కెట్లు….ఇవి మమత బడ్జెట్‌లో  ఉంటాయని భావిస్తున్న హైలైట్స్..

రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే విధంగా… 132 నెంబర్‌తో ఫిర్యాదుల కోసం SMS వ్యవస్థను తీసుకురానున్నారు.

బడ్జెట్‌ రూపకల్పన కంటే బెంగాల్ ఎలక్షన్సే మమతను ఎక్కువగా తరుముతున్నాయి. బెస్ట్‌ బెంగాల్‌లో పాగా వేసేందుకు ఈ బడ్జెట్‌నే మమత ఆయుధంగా చేసుకోనున్నారు. అందుకే మమత ఎక్స్‌ప్రెస్‌ది ప్రస్తుతానికి వన్‌వే జర్నీ – బెంగాల్ టు బెంగాల్‌….

Advertisements