నమస్తే నా బ్లాగు ప్రపంచానికి అందరికీ స్వాగతం. నేను ఫణికుమార్ అనంతోజు. వృత్తి జర్నలిజం. ప్రవృత్తులు పెద్దగా లేకపోయినా…వృత్తి రిత్యా రాయడమే నా జీవితం కాబట్టి…అదేదో బ్లాగులో కూడా చేద్దామని ఇక్కడ చేరిపోయా. పాత్రికేయుడిగా ( పత్రికల్లో పనిచేసే వాడే పాత్రికేయుడు కాదు.టీవీల్లో కూడా ) నిత్యం ఎన్నో వార్తలను రాస్తూ…ఇతరులను రాసిన దాన్ని సవరిస్తూ…ఛానల్ ద్వారా ప్రజలు వార్తలు అందిస్తూ ఉంటాను. అయితే అదంతా వన్ వే కమ్యూనికేషన్. మేం చెప్పాలనుకున్నది జనానికి చెప్తాం. అదే బ్లాగులో నైతే.. మన ఇష్టం. ఎయిర్ టెల్ వారి ఎక్స్ ప్రెస్ యువర్ సెల్ఫ్ లాగా ఏదైనా పంచుకోవచ్చు. బెజవాడలో పుట్టిన వాడిని…కృష్ణా నదితో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ని
( ఇప్పుడు ) అందుకే కృష్ణాతీరం అని నా బ్లాగు కు పేరు పెట్టుకున్నాను. ప్రత్యేకంగా ఫలానా విషయం అంటూ చర్చించడానికి లేదు. ఆవకాయ బిర్యాని నుంచి జింబాబ్వే ద్రవ్యోల్బణం వరకూ…అన్నీ బ్లాగీకరిస్తా.
Advertisements